22 మూవీ లిరికల్ సాంగ్ ని రిలీజ్ చేసిన రెబల్ స్టార్ ప్రభాస్….!!

 182 total views,  1 views today

టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, గత ఏడాది సాహో తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. సుజీత్ దర్శకత్వంలో యువి క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితం అయిన ఆ సినిమా మంచి సక్సెస్ ని అందుకుంది. ఇక ప్రస్తుతం జిల్ మూవీ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో జాన్ మూవీలో హీరోగా నటిస్తున్న ప్రభాస్, నేటి ఉదయం 8 గంటల 59 నిమిషాలకు ’22’ మూవీ లిరికల్ సాంగ్ ని రిలీజ్ చేసారు. నూతన నటుడు రూపేష్ హీరోగా, సలోని మిశ్ర హీరోయిన్ గా ప్రముఖ పీఆర్వో బిఎ రాజు తనయుడు శివ కుమార్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలోని ‘మార్ మార్ కె జీన హై’ అనే పవర్ఫుల్ లిరికల్ సాంగ్ వీడియోని ప్రభాస్ తన చేతులమీదుగా రిలీజ్ చేసారు. 

ఇక ఈ సాంగ్ ని చూసిన ప్రభాస్, తప్పకుండా సినిమా మంచి సక్సెస్ అవుతుందని, హీరో రూపేష్ పోలీస్ డ్రెస్ లో ఎంతో బాగున్నారని, అలానే దర్శకుడు శివ కుమార్ ఫస్ట్ మూవీ తో మంచి హిట్ కొట్టాలని ఆకాంక్షిస్తూ సినిమా యూనిట్ కి అభినందనలు తెలిపారు. మంచి క్రైం, సస్పెన్స్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ రిలీజ్ చేయగా, ఫస్ట్ లుక్ టీజర్ ని కింగ్ అక్కినేని నాగార్జున రిలీజ్ చేసారు. ఇక నేడు రెబల్ స్టార్ కూడా ఈ సినిమాకు తోడవడంతో సినిమాకు మంచి పబ్లిసిటీ లభించింది. ఇక ప్రస్తుతం చివరి దశ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని అతి త్వరలో రిలీజ్ చేయనున్నారు. శ్రీమతి సుశీల దేవి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ : బి.వి.రవికిరణ్‌, సంగీతం: సాయికార్తీక్‌, ఎడిటింగ్‌: శ్యామ్‌ వాడవల్లి అందిస్తున్నారు….!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *