అవును నా సినిమాలో బాలయ్య అటువంటి పాత్రలో నటిస్తున్నారు : బోయపాటి శ్రీను….!!

 163 total views,  1 views today

గతంలో నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్ కథా చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను ల కలయికలో వచ్చిన రెండు సినిమాలైనా సింహా, లెజెండ్ రెండూ కూడా ఒకదానిని మించి మరొకటి అద్భుత విజయాలు అందుకున్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్ లో మిరియాల రవీందర్ రెడ్డి నిర్మాతగా ఒక సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం లాక్ డౌన్ నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ కూడా నిలిపివేయబడింది.

Disha episode in Balaiahs movie

ఇటీవల సింహా సినిమా సక్సెస్ఫుల్ గా పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక ప్రముఖ ఛానల్ తో మాట్లాడిన బోయపాటి శ్రీను, ఈ సినిమాలో బాలయ్య పోషిస్తోంది అఘోరా మాదిరిగా ఉండే క్యారెక్టర్ అని, అయితే తాను దాని గురించి ఇంతకుమించి చెప్పలేనని అన్నారు. పవర్ఫుల్ యాక్షన్ సన్నివేశాలతో సాగే ఈ సినిమా తప్పకుండా గతంలో తామిద్దరి కాంబో లో వచ్చిన సింహా, లెజెండ్ లను మించే స్థాయిలోనే ఉంటుందని, లాక్ డౌన్ ముగిసిన అనంతరం వీలైనంత త్వరగా మిగిలిన షూటింగ్ పూర్తి చేసి సినిమాని రిలీజ్ చేస్తాం అని బోయపాటి అన్నారు…..!!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *