విశ్వక్ సేన్ ‘హిట్’ మూవీ రివ్యూ : ఎలా ఉందంటే…..!!

 644 total views,  1 views today

ఫలక్ నుమా దాస్ సినిమాతో నటుడిగా ఆడియన్స్ నుండి మంచి పేరు దక్కించుకున్న యువ హీరో విశ్వక్ సేన్ నటించిన తాజా సినిమా హిట్. చిలసౌ సినిమా ఫేమ్ రుహాని శర్మ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు యువ దర్శకుడు శైలేష్ దర్శకత్వం వహించగా నాచురల్ స్టార్ నాని ఈ సినిమా ని, తన వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో చిత్రీకరించబడ్డ ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. మరి ఈ సినిమా యొక్క టాక్ ఎలా ఉందొ, అలానే కథ, కథనాలు విశ్లేషణవంటివి ఇప్పుడు చూద్దాం….!!

కథ : 

ముందుగా కథ విషయానికి వస్తే, పోలీస్ విభాగంలో క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్ గా పనిచేస్తున్న విక్రమ్ రుద్రరాజుకు ప్యానిక్ అటాక్ డిజార్డర్ అనే వింత వ్యాధి ఉంటుంది. అయితే తొలి చూపులోనే తాను ఎంతో ఇష్టపడి ప్రేమించిన హీరోయిన్ కొద్దిరోజుల తరువాత మిస్ అవుతుంది. అలానే ప్రీతి అనే మరొక అమ్మాయి కూడా మిస్ అయినట్లు వారికి కంప్లైంట్ వస్తుంది. అయితే ఆ క్రమంలో హీరో ఓవైపు హీరోయిన్ ని అలానే మిస్ అయిన ప్రీతిని ఎలా ట్రేస్ చేసాడు. అసలు వారు ఎందుకు మిస్ అయ్యారు. విక్రమ్ యొక్క గత జీవితం, చివరిగా సినిమా ఎలా ఎండ్ అవుతుంది వంటి అంశాలు గురించి తెలియాలంటే సినిమా చూసి తీరాల్సిందే…!!

విశ్లేషణ : 

ముందుగా ఈ సినిమాతో మరొక్కసారి తన ఆకట్టుకునే పెర్ఫార్మన్స్ ని కనబరిచిన హీరో విశ్వక్ గురించి చెప్పుకోవాలి. ప్యానిక్ అటాక్ డిజార్డర్ వ్యాధితో బాధపడే ఆఫీసర్ గా విశ్వక్ చేసిన నటన ఎంతో అద్భుతంగా ఉందనే చెప్పాలి. ఫలక్ నుమా దాస్ కు ఈ సినిమాకు ఎటువంటి పోలిక లేదు. ఫుల్ గా సస్పెన్స్ తో సాగె ఈ కథలో వచ్చే కొన్ని సీన్స్ లో విశ్వక్ జీవించాడనే చెప్పాలి. ఇక సినిమాలో ఫస్ట్ హాఫ్ ఎంతో అదిరిపోతుంది. పలు రకాల ఆసక్తికరమైన ఇన్వెస్టిగేటివ్ సీన్స్ తో ఫస్ట్ హాఫ్ మొత్తం సాగడం, అలానే మంచి ఇంట్రెస్టింగ్ సీన్ తో ఇంటర్వెల్ ఎపిసోడ్ రావడంతో ప్రేక్షకులకు సెకండ్ హాఫ్ పై మంచి ఆసక్తి ఏర్పడుతుందట. ఇక సెకండ్ హాఫ్ కూడా మెల్లగా రాను రాను పుంజుకుంటుందని, ఇక మధ్యలో వచ్చే సీన్స్ ఎంతో బాగున్నాయని అంటున్నారు. ఇక సినిమాలో వచ్చే ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సీన్స్ ఆడియన్స్ ని థ్రిల్ చేస్తాయని టాక్. ఇక దర్శకుడు శైలేష్, ఈ సినిమాని ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యేలా తీయడంలో చాలావరకు సక్సెస్ అయ్యాడని అంటున్నారు. ఇక హీరోయిన్ రుహని, ఈ సినిమాలో ఎంతో బాగా నటించిందని, అలానే హీరోకి ఆమెకు మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ కూడా బాగున్నాయని అంటున్నారు. విజువల్స్ కూడా ఎంతో బాగున్నా ఈ సినిమాకు వివేక్ సాగర్ ఆడించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బ్యాక్ బోన్ అని అంటున్నారు. ఇక సినిమాలోని ఇతర కీలక పాత్రలలో కన్పించిన మురళీ శర్మ, బ్రహ్మాజీ తదితరులు తన పాత్రల్లో ఒదిగిపోయి నటించారని, మొత్తంగా ఈ సినిమా అందరినీ అలరిస్తుందని అంటున్నారు…..!!

ప్లస్ పాయింట్స్ : 

విశ్వక్ సేన్ నటన 
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ 
థ్రిల్లింగ్ ఇన్వెస్టిగేటివ్ సీన్స్ 
స్క్రీన్ ప్లే 

మైనస్ పాయింట్స్ :

పెద్దగా ఎంటర్టైన్మెంట్ అంశాలు లేకపోవడం 
సీరియస్ గా సాగె కథ, కథనాలు 

తీర్పు : 

ఇక నేడు మొత్తంగా ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి సక్సెస్ టాక్ నే సంపాదించినట్లు తెలుస్తోంది. మంచి సీట్ ఎడ్జి థ్రిల్లర్ లను ఇష్టపడే వారితో పాటు మంచి ఆకట్టుకునే సినిమాని చూడాలని అనుకునేవారికి ఈ సినిమా ఎంతో నచ్చుతుందని, హీరో విశ్వక్ సేన్ నటన, చాలావరకు ఆకట్టుకునే సీన్స్ తో సాగిన స్క్రీన్ ప్లే, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, మంచి విజువల్స్ వంటివి వెరసి ఈ సినిమాని మంచి హిట్ టాక్ లభించేలా చేశాయని, అలానే రాబోయే రోజుల్లో ఈ సినిమా మంచి కలెక్షన్ కూడా అందుకుంటుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు….!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *