211 total views, 1 views today
మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై మెగాసుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ఉప్పెన. కృతి శెట్టి హీరోయిన్ గా రూపొందుతున్న ఈ సినిమాకు బుచ్చి బాబు సనా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్, అలానే రెండు సాంగ్స్ కూడా శ్రోతలను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఇకపోతే నేడు ఈ సినిమా లో విలన్ గా రాయనం అనే పాత్రలో నటిస్తున్న కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు సినిమా నిర్మాతలు. పంచె కట్టుకుని, ఖద్దరు షర్ట్ వేసుకుని స్టైల్ గా సిగరెట్ తాగుతూ ఉన్న విజయ్ సేతుపతి పోస్టర్ ప్రస్తుతం పలు సోషల్ మీడియా వేదికల్లో వైరల్ అవుతోంది. కాగా ఏప్రిల్ లో రిలీజ్ కావలసిన ఈ సినిమాని కరోనా ఎఫెక్ట్ కారణంగా జూన్ కి వాయిదా వేసినట్లు సమాచారం….!!