విజయ్ – పూరి ల ఫైటర్ లో అవే మెయిన్ హైలైట్ అట….??

 211 total views,  1 views today

టాలీవుడ్ యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ హీరోగా, అనన్య పాండే హీరోయిన్ గా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పలు భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ఫైటర్. ఇప్పటికే కొంత మేర షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాని ప్రస్తుతం కరోనా వలన లాకౌట్ ప్రకటించడంతో షూటింగ్స్ నిలుపుదల చేయడంతో ఈ సినిమాని కూడా ఆపేసారు.

Ananya Pandey joins Vijay Deverakonda in Puri Jagannadh's Fighter ...

అయితే నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమాలో అదిరిపోయే యాక్షన్ సీన్స్, పూరి మార్క్ పంచ్ డైలాగ్స్, థియేటర్స్ లో ఆడియన్స్ ని ఎంతో థ్రిల్ చేస్తాయని, మరీ ముఖ్యంగా ఇంటర్వెల్ ఎపిసోడ్ తో పాటు క్లైమాక్స్ ఎపిసోడ్స్ సినిమాలో మరొక రేంజ్ లో ఉంటాయని అంటున్నారు. ఇప్పటికే ఇస్మార్ట్ శంకర్ తో మంచి హిట్ కొట్టి మళ్ళి ఫామ్ లోకి వచ్చిన పూరి ఖాతాలో ఈ సినిమా ద్వారా, పూరి ఖాతాలో ఈ సినిమా రూపంలో మరొక హిట్ పడడం ఖాయం అని సమాచారం. ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజం అయితే విజయ్ కి ఈ సినిమా మరింత గొప్ప ఇమేజ్ ని తెచ్చిపెట్టడం ఖాయం అనే చెప్పాలి…!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *