136 total views, 1 views today
ఇటీవల కెరీర్ పరంగా పెద్దగా సక్సెస్ లు అందుకోలేకపోతున్న విజయ్ దేవరకొండ, ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా ఫైటర్. వాస్తవానికి ఈ సినిమాకు ఇంకా టైటిల్ అధికారికంగా ఫిక్స్ కానప్పటికీ, ఈ టైటిల్ మాత్రం పలు మీడియా మాధ్యమాల్లో కొద్దిరోజులుగా ప్రచారం అవుతోంది. కాగా ఈ సినిమాలో విజయ్ క్యారెక్టర్ ఎంతో పవర్ఫుల్ గా డిజైన్ చేశారట పూరి. సినిమా కోసం విజయ్ పలు రకాల విదేశీ యుద్ధ విద్యల్లో ఎంతో శిక్షణ తీసుకుంటున్నతలు సమాచారం.
తన పాత్ర కోసం ఎంతో కష్టపడుతున్న విజయ్, తప్పకుండా ఈ సినిమాతో హిట్ కొడతాడని అంటోంది సినిమా యూనిట్. సినిమా స్క్రిప్ట్ ని పక్క యాక్షన్ ఎంటర్టైనర్ గా రెడీ చేసిన పూరి, ఈ సినిమా ద్వారా సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకోవడం ఖాయం అంటున్నారు. మరి ఇదే కనుక నిజం అయితే, మొత్తానికి కెరీర్ లో మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న విజయ్ కు ఇది మంచి బ్రేక్ ని ఇచ్చినట్లే. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని దసరా పండుగకు రిలీజ్ చేసే అవకాశం ఉంది. విజయ్ సరసన అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు….!!