185 total views, 1 views today
ప్రస్తుతం కరోనా వ్యాధి ప్రపంచదేశాలన్నిటినీ ఎంతో కుదిపేస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ మహమ్మారి మరింతగా ప్రబలకుండా ఉండేందుకు ఎక్కడి ప్రజలు అక్కడే తమ తమ ఇళ్లలో ఉండేలా పలు దేశాలు కొన్ని వారాలుగా లాక్ డౌన్ అమలు చేస్తున్నాయి. దీని వలన అనేకమంది ప్రజలు ఉపాధి కరువై తిండి లేక నానా అవస్థలు పడుతుండడంతో ప్రభుత్వాలతో పాటు కొందరు ప్రముఖులు సైతం తమ దయార్ద్ర హృదయంతో సాయం చేయడానికి ముందుకు వస్తున్నారు.
2 Big Important Announcements! ❤️🤗https://t.co/5n1pnJRCae
Full details at https://t.co/AzYE7kSgsJ#TDF #MCF pic.twitter.com/MVzFbdlXzP
— Vijay Deverakonda (@TheDeverakonda) April 26, 2020
మరోవైపు సినిమా ఇండస్ట్రీ నుండి కూడా ఇప్పటికే ఎంతోమంది విరాళాలు అందించగా, యువ నటుడు యూత్ సెన్షేషనల్ హీరో అయిన విజయ్ దేవరకొండ నిన్న కరోనా బాధితులకు ఏకంగా రూ.1.30 కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇటువంటి కష్ట పరిస్థితుల్లో ప్రజలను ఆదుకోవడం తన ధర్మం అని, అందుకే తన తల్లితండ్రులతో చర్చించి తనకు వీలైన ఈ మొత్తాన్ని విరాళంగా ఇస్తున్నట్లు నిన్న తన సోషల్ మీడియా అకౌంట్స్ లో విజయ్ ఒక పోస్ట్ చేసారు……!!