కొరటాల ఛాలెంజ్ ని సక్సెస్ఫుల్ గా పూర్తి చేసిన రౌడీ హీరో విజయ్….!!

 193 total views,  2 views today

ప్రస్తుతం టాలీవుడ్ తరాల మధ్య మంచి జోష్ తో కొనసాగుతున్న ‘బి ద రియల్ మ్యాన్’ ఛాలెంజ్ ని ఇటీవల పూర్తి చేసిన సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ, దానిని రౌడీ హీరో విజయ్ దేవరకొండకు విసిరారు. కాగా విజయ్ ఆ ఛాలెంజ్ ని నేడు పూర్తి చేయడం జరిగింది.

 


నిద్ర లేచిన తరువాత తన స్వంత పనులు చేసుకుంటూ ఇంట్లో వాటర్ బాటిల్స్ లో నీళ్లు నింపుతూ, మాంగో జ్యూస్ చేసి తన తల్లి తండ్రులకు ఇవ్వడం, అలానే మధ్యలో కొద్దిసేపు వీడియో గేమ్స్ కూడా ఆడిన విజయ్, కొంత టిప్స్ ని కూడా తన ఫ్యాన్స్ ని వీడియో ద్వారా అందించడం జరిగింది. కాగా విజయ్ పోస్ట్ చేసిన ఆ వీడియో ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కాగా ఈ ఛాలెంజ్ ని మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్ కు విజయ్ విసరడం జరిగింది….!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *