254 total views, 1 views today
పెళ్లి చూపులు సినిమాతో హీరోగా మారిన యువ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, ఫస్ట్ మూవీ తోనే సూపర్ హిట్ కొట్టడం జరిగింది. ఆ తరువాత వచ్చిన అర్జున్ రెడ్డి మరింత గొప్ప విజయాన్ని అందుకుని యువత లో విజయ్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆపై పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన గీత గోవిందం కూడా సూపర్ హిట్ కొట్టడంతో విజయ్ టాలీవుడ్ స్టార్ హీరోగా మారిపోయారు.
ఇక ప్రస్తుతం పూరి జగన్నాథ్ తో ఒక పెద్ద పాన్ ఇండియా సినిమా చేస్తున్న విజయ్, నేడు తన 30వ పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు. కాగా నేడు ఆయనకు పలువురు అభిమానులు, ప్రేక్షకులతో పాటు ఎందరో సినిమా ప్రముఖులు సైతం తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు…..!!!