150 total views, 1 views today
టాలీవుడ్ కి మొదట క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, ఆపై పెళ్లిచూపులు సినిమా తో హీరోగా మారిన యువ సంచలన నటుడు విజయ్ దేవరకొండ, ఆ తరువాత అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాలతో సూపర్ డూపర్ హిట్స్ కొట్టి యూత్ లో విపరీతమైన క్రేజ్ తో పాటు టాలీవుడ్ లో స్టార్ హీరోగా మంచి పేరు గడించారు. ఇక ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఫైటర్ అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్న రౌడీ హీరో విజయ్, ఇటీవల రష్మిక మందన్న తో కలిసి రెండవసారి నటించిన సినిమా డియర్ కామ్రేడ్. భరత్ కమ్మ దర్సకత్వంలో తెరెకక్కిన ఆ సినిమా ఎబోవ్ యావరేజ్ విజయాన్ని అందుకుంది.
ఇక ఇటీవల ఆ సినిమాని యూట్యూబ్ లో హిందీ లో డబ్ చేసి రిలీజ్ చేయగా, అప్పుడే 100 మిలియన్లకు పైగా వ్యూస్ ని, అలానే 1.3 పైగా లైక్స్ ని అందుకుని సూపర్ రికార్డు కొట్టింది. దీనితో విజయ్ ఫ్యాన్స్ అమితానందాన్ని వ్యక్తం చేస్తున్నారు….!!