వాళ్లే నిజమైన హీరోలు, వాళ్లకు సెల్యూట్ : విక్టరీ వెంకటేష్…..!!

 171 total views,  1 views today

మన దేశంతో పాటు పలు ఇతర దేశాలన్నీ కూడా ఇప్పటికే ఈ మహమ్మారి కరోనా దెబ్బకు భయపడి పూర్తిగా ప్రజలను ఇళ్లకు పరిమితం చేస్తూ లాకౌట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అవసరం ఉంటె తప్ప ప్రజలు ఎవరూ కూడా బయటకు రావద్దని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల పిలుపునివ్వడం జరిగింది. ఇక ఈ లాకౌట్ ని మరింత కఠినంగా అమలు చేయడం కోసం పోలీసులు నిరంతరం ఎంతో శ్రమిస్తున్నారు.

 

ఇక మరోవైపు కరోనా బారిన పడుతున్న ప్రజల ఆరోగ్య రక్షణకు ఎందరో డాక్టర్లు శ్రమిస్తున్నారు. ఇక నేడు విక్టరీ వెంకటేష్, తన సోషల్ మీడియా అకౌంట్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ, ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న ఈ కష్ట సమాయంలో మనకి అన్ని విధాలా రక్షణనిస్తున్న పోలీసులు, డాక్టర్లు నిజమైన హీరోలని, వారందరికీ తన తరపున సెల్యూట్ చేస్తున్నట్లు తెలిపారు వెంకటేష్….!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *