ఇది నిజంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి అదిరిపోయే న్యూసే……!!

 555 total views,  2 views today

ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ లో కొమరం భీం పాత్రలో నటిస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్, దాని అనంతరం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్న విషయం తెలిసిందే. హారిక హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు కలిసి నిర్మించనున్న ఈ సినిమాకు ఎస్ ఎస్ థమన్ సంగీతాన్ని అందించనున్నాడు. ఆర్ఆర్ఆర్ షూటింగ్ అయిపోయిన వెంటనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే పూర్తి స్క్రిప్ట్ ని సిద్ధం చేసిన త్రివిక్రమ్,

Kiara Advani: Aaliya is my first name. Salman Khan told me to ...

రెండు రోజుల క్రితం హీరోయిన్ ని కూడా ఫైనలైజ్ చేసినట్లు టాలీవుడ్ వర్గాల టాక్. ఇటీవల మహేష్ భరత్ అనే నేను, రామ్ చరణ్ వినయవిధేయ రామ సినిమాల్లో హీరోయిన్ గా నటించిన కియారా అద్వానీ ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జోడిగా నటించనున్నట్లు చెప్తున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమే అయితే మాత్రం ఎప్పటినుండో తమ హీరోతో కియారా నటిస్తే చూడాలని ఆశపడుతున్న యంగ్ టైగర్ ఫ్యాన్స్ కు ఇది మంచి అదరగొట్టే న్యూస్ అని చెప్పవచ్చు…..!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *