నితిన్ కోసం వరుణ్ వస్తున్నాడుగా…..!!

 182 total views,  1 views today

యంగ్ హీరో నితిన్ హీరోగా ఇటీవల వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా భీష్మ. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని ఆర్గానిక్ ఫార్మింగ్ నేపథ్యంలో మంచి ఎంటర్టైన్మెంట్ తో పాటు పలు కమర్షియల్ హంగులు జోడించి దర్శకుడు వెంకీ ఈ సినిమాని ఎంతో గొప్ప తీసాడు. 

తొలిరోజు  తొలిఆట నుండి సూపర్ హిట్ టాక్ ని అదిరిపోయే రేంజ్ లో కలెక్షన్ ని అందుకున్న ఈ సినిమా సక్సెస్ మీట్ ని రేపు విశాఖపట్నంలో, సిరిపురం గురజాడ కళాక్షేత్రం లో ఎంతో గ్రాండ్ గా నిర్వహించనుంది సినిమా యూనిట్. కాగా ఈ వేడుకకు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రత్యేక అతిథిగా విచ్చేస్తున్నారు. యూనిట్ సభ్యులతో పాటు మరికొందరు అతిథులు కూడా హాజరు కానున్న ఈ వేడుక కోసం ఇప్పటికే పలు ఏర్పాట్లు చేయడం జరిగింది….!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *