రవితేజ ‘క్రాక్’ లో ‘జయమ్మ’ గా వరలక్ష్మి శరత్ కుమార్….!!

 90 total views,  2 views today

ప్రస్తుతం మాస్ రాజా రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న కాప్ డ్రామా మూవీ క్రాక్. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్ జయమ్మ అనే పవర్ఫుల్ రోల్ లో నటిస్తున్నట్లు నేడు ఆమె పుట్టిన రోజు సందర్భంగా సినిమా యూనిట్ ఆమె ఫస్ట్ లుక్ తో కూడిన పోస్టర్ ని సోషల్ మీడియా మాధ్యమాల్లో రిలీజ్ చేసింది.

 

ఇక ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ మంచి స్పందనను రాబట్టడంతో పాటు ప్రేక్షకుల్లో సినిమాపై మంచి అంచనాలు ఏర్పరిచింది. గతంలో రవితేజ హీరోగా గోపిచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన డాన్ శ్రీను సినిమా యావరేజ్ విజయాన్ని అందుకోగా, ఆ తరువాత వీరిద్దరి కాంబోలో వచ్చిన బలుపు బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మరి రవితేజ, గోపీచంద్ కలిసి చేస్తున్న ఈ మూడవ ప్రాజక్ట్ ఎంత వరకు సక్సెస్ అవుతుందో తెలియాలంటే మాత్రం ఈ సినిమా రిలీజ్ డేట్ అయిన మే 8 వరకు వెయిట్ చేయాల్సిందే…!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *