171 total views, 1 views today
ప్రస్తుతం టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్. దాదాపుగా రెండేళ్లకు పైగా గ్యాప్ తీసుకున్న పవర్ స్టార్ సినిమా కావడంతో దీనిపై ప్రేక్షకుల్లో, ముఖ్యంగా ఆయన ఫ్యాన్స్ లో విపరీతమైన అంచనాలు నెలకొని ఉన్నాయి. ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు, బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ లు కలిసి ఎంతో భారీగా నిర్మిస్తున్న ఈ సినిమాకు యువ దర్శకుడు వేణుశ్రీరాం దర్శకత్వం వహిస్తుండగా, యువ సంగీత దర్శకుడు ఎస్ ఎస్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక ఈ సినిమా నుండి ‘మగువ మగువ’ పల్లవితో సాగె ఫస్ట్ సాంగ్ ప్రోమోని కాసేపటి క్రితం యూట్యూబ్ లో రిలీజ్ చేసింది సినిమా యూనిట్.
థమన్ అదిరిపోయే ట్యూన్ అందించిన ఈ సాంగ్ ని యువ సెన్సేషనల్ సింగర్ సిద్ శ్రీరామ్ ఆలపించగా రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించారు. ఇక ప్రస్తుతం ఈ సాంగ్ టీజర్ యూట్యూబ్ లో మంచి వ్యూస్ తో దూసుకుపోతోంది. ఎల్లుండి, అనగా మార్చి 8వ తేదీన మహిళా దినోత్సవం సందర్భంగా ఈ సాంగ్ ఫుల్ లిరికల్ వీడియో ని యూట్యూబ్ లో రిలీజ్ చేస్తున్నామని సినిమా యూనిట్ ఒక ప్రకటన రిలీజ్ చేసింది. దీనితో పవర్ స్టార్ ఫ్యాన్స్ అప్పుడే సంబరాలు మొదలెట్టేసారు. ఇక అన్ని కార్యక్రమాలు ముగించి ఈ సినిమాని మే నెల సెకండ్ వీక్ లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు…!!