యూట్యూబ్ లో 25 మిలియన్ల అందుకున్న ఉప్పెన ‘నీకన్ను నీలి సముద్రం’ సాంగ్ …..!!

 251 total views,  1 views today

మెగా సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ సోదరుడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా సుకుమార్ రైటింగ్స్, మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ‘ఉప్పెన’. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తుండగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.

ఇక ఈ సినిమా నుండి ఇటీవల రిలీజ్ అయిన నీకన్ను నీలి సముద్రం సాంగ్ ఇప్పటికే ప్రేక్షకుల నుండి మంచి స్పందన అందుకోవడంతో పాటు నేడు యూట్యూబ్ లో ఏకంగా 25 మిలియన్స్ వ్యూస్ అందుకుని సరికొత్త రికార్డు ని సొతం చేసుకుంది. లవ్, యాక్షన్ కథాంశంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్నాడు. ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్ తో ఈ సినిమా షూటింగ్ కి బ్రేక్ పడడంతో రిలీజ్ డేట్ కూడా వాయిదాపడినట్లు తెలుస్తోంది. కాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాని జూన్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే అవకాశం కనపడుతోంది…..!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *