218 total views, 1 views today
మెగా సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ సోదరుడు పంజా వైష్ణవ్ తేజ్ తొలిసారి హీరోగా యువ దర్శకుడు బుచ్చి బాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ ఉప్పెన. ప్రముఖ టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ఇటీవల యూట్యూబ్ లో రిలీజ్ అయి మెగా ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల నుండి కూడా మంచి రెస్పాన్స్ సంపాదించడం జరిగింది. వైష్ణవ్ తేజ్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో కోలీవుడ్ అగ్ర నటుడు విజయ్ సేతుపతి విలన్ పాత్రలో నటిస్తున్నారు.
ఇకపోతే ఈ సినిమాలోని నీకన్ను నీలి సముద్రం అనే పల్లవితో సాగె లిరికల్ సాంగ్ ని మొన్న రిలీజ్ చేసింది సినిమా యూనిట్. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ సాంగ్ ని జావేద్ ఆలీ ఎంతో ఆకట్టుకునేలా ఆలపించగా యువ పాటల రచయిత శ్రీమణి అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు. ఇక ప్రస్తుతం ఈ సాంగ్ 6 మిలియన్లకు పైగా వ్యూస్ తో పాటు 100కె కు పైగా లైక్స్ తో దూసుకుపోతోంది. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ సినిమాని ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు……!!