చిరు 152 నుండి త్రిష అవుట్….. !!  

 246 total views,  1 views today

మూడేళ్ళ క్రితం వచ్చిన ఖైదీ నెంబర్ 150 సినిమాతో టాలీవుడ్ కి నటుడిగా రీఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి, ఆ సినిమా సూపర్ హిట్ తో తన జోష్ ఏమాత్రం తగ్గలేదని మరొక్కసారి నిరూపించుకున్నారు. ఇక గత ఏడాది సైరా నరసంహారెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగాస్టార్, ప్రస్తుతం సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఒక మంచి పవఫుల్ పాయింట్ తో పలు కమర్షియల్ హంగులు కలగలిపి దర్శకుడు శివ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. 

మణిశర్మ సంగీతాన్నిఆ అందిస్తున్న ఈ సినిమాలో మెగాస్టార్ పాత్ర అదిరిపోనుందని టాక్. ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తన్న త్రిష, నేడు ఈ సినిమా షూటింగ్ ని తప్పుకుంటున్నట్లు ఒక పోస్ట్ చేసింది. ఇటీవల మెగాస్టార్, కొరటాల గారి సినిమాలో నేను హీరోయిన్ గా ఎంపికయ్యాను, అయితే ప్రస్తుతం సినిమాకు సంబంధించి వచ్చిన కొన్ని క్రియేటివ్ డిఫరెన్సెస్ వలన సినిమా నుండి నేను తప్పుకుంటున్నానను, సినిమా మంచి సక్సెస్ కావాలని యూనిట్ కు నా అభినందనలు తెలుపుతున్నాను, అతి త్వరలో మరొక సినిమాతో మీముందుకు వస్తాను అంటూ త్రిష తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఒక పోస్ట్ పెట్టారు. 

అయితే ఆమె తప్పుకోవడానికి ఏదైనా మరొక కారణం ఉందేమో అంటూ పలు టాలీవుడ్ వర్గాల్లో నేడు ఈ విషయమై కొంత చర్చ జరుగుతున్నప్పటికీ, ఆమె స్థానంలో ఆల్రెడీ మరొక హీరోయిన్ ని యూనిట్ ఎంపిక చేయడం జరిగిందని, అలానే ఈ సినిమా లో కీలక పాత్ర సూపర్ స్టార్ మహేష్ కూడా ఆల్మోస్ట్ ఫిక్స్ అయ్యారని అంటున్నారు. సినెమ టైటిల్ తో పాటు మిగతా ఇతర విషయాలన్నీ కూడా ఈ రాబోయే ఉగాది పండుగ రోజున అధికారికంగా వెల్లడి కానున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమా స్వతంత్ర దినోత్సవ కానుకగా ఆగష్టు 15న రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట….!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *