మహేష్ బాబు ‘యువరాజు’ కు 20 ఏళ్ళు….!!

 170 total views,  1 views today

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా సాక్షి శివానంద్, సిమ్రాన్ హీరో హీరోయిన్లుగా 2000వ సంవత్సరంలో వచ్చిన సినిమా యువరాజు. యువ దర్శకుడు వై వి ఎస్ చౌదరి దర్శత్వంలో బూరుగుపల్లి శివరామకృష్ణ నిర్మాతగా శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ ఫిలిమ్స్ బ్యానర్ పై వచ్చిన ఆ సినిమా, అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది.

Image

అంతకముందు రాజకుమారుడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి, ఫస్ట్ మూవీ తో బెస్ట్ హిట్ కొట్టిన మహేష్, తదుపరి వచ్చిన యువరాజు సినిమాలో ఒక బిడ్డకు తండ్రిగా నటించారు. ట్రయాంటిల్ లవ్ స్టోరీగా మంచి యాక్షన్, ఎంటర్టైన్మెంట్ తో దర్శకుడు వై వి ఎస్ చౌదరి ఈ సినిమాని తెరకెక్కిచడం జరిగింది. కాగా ఈ సినిమా ప్రారంభోత్సవానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్ వంటి ప్రముఖులు అప్పట్లో హాజరవడం జరిగింది. ఇక నేటితో ఈ సినిమా  సక్సెస్ఫుల్ గా 20 పూర్తి చేసుకోవడంతో సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో దానిని పండుగలా జరుపుకుంటున్నారు…..!!

Image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *