455 total views, 1 views today
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు నాలుగు రోజుల క్రితం రెండవ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఆయన మొదటి భార్య అనిత కొన్నాళ్ల క్రితం అనారోగ్య కారణాల వలన మరణించిన విషయం తెలిసిందే. ఇక ఇటీవల కొద్దిరోజులుగా దిల్ రాజు పెళ్లి విషయమై వార్తలు రావడం, మొత్తానికి అది నిజమై పెళ్లి కూడా జరగడం విశేషం. ఇక ఆయన చేసుకున్న భార్య గురించి చాలా మందికి కొన్ని విషయాలు తెలియదు.
వివరాల్లోకి వెళితే, దిల్ రాజు స్వంత ప్రాంతమైన నిజామాబాద్ లో తమ సమీప బంధువులైన వారి ఇంట అమ్మాయినే వివాహం చేసుకున్నారు. ఆమె పేరు తేజస్విని, అయితే వివాహం తరువాత ఆమె పేరును వైఘా రెడ్డిగా మార్చడం జరిగింది. తన తండ్రి వివాహం చేసుకోవడం తనకు ఎంతో సంతోషంగా ఉందని ఇటీవల ఒక ప్రకటన విడుదల చేసిన దిల్ రాజు కుమార్తె హన్షితా రెడ్డి, ఇకపై రాబోయే జీవితం మీ ఇద్దరూ కూడా ఎంతో ఆనందంగా గడపండి అంటూ ఆమె తన ప్రకటనలో తెలిపారు. వైఘా రెడ్డి రాకతో దిల్ రాజు ఇంట సరికొత్త కాంతులు వెల్లివిరిశాయనే చెప్పాలి…..!!!