184 total views, 1 views today
ప్రస్తుతం గత కొద్దిరోజులుగా కరోనా ఎఫెక్ట్ వలన మన దేశం మొత్తం కూడా లాక్ డౌన్ అమలవుతున్న నేపదాయంలో సినిమా షూటింగ్స్ కూడా నిలిచిపోవడంతో ఎందరో నిర్మాతలకు అది పెద్ద తలనొప్పిగా మారింది. తాము ఎన్నో కోట్ల రూపాయల పెట్టుబడిని అప్పుగా తెచ్చం అని, అతి త్వరలో ప్రభుత్వం తమ విషయమై మంచి నిర్ణయం తీసుకుంటుందని కొన్నాళ్లుగా పలువురు టాలీవుడ్ నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.
కాగా నేడు సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి తలసాని శ్రీనివాస్ యదవ్ తో కలిసి టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలైన దిల్ రాజు, సి కళ్యాణ్ సహా మరికొందరు సినిమా ప్రముఖులు, ప్రస్తుత పరిస్థితులు ఎప్పుడు షూటింగ్స్ మొదలెట్టాలి అనే విషయమై ఫిలిం ఛాంబర్ లో చర్చలు జరుపడం జరిగింది. కాగా అందుతున్న సమాచారాన్ని బట్టి జూన్, లేదా జులై నెలల్లో సినిమా షూటింగ్స్ ప్రారంభం కానున్నాయని, అయితే కొన్ని రకాల ఆంక్షలతో షూటింగ్స్ జరుపుకునేలా ప్రభుత్వం అనుమతినివ్వనున్నట్లు తెలుస్తోంది…..!!