474 total views, 1 views today
ముందుగా రవితేజ హీరోగా దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో తెరకెక్కిన భద్ర సినిమా ద్వారా దర్శకుడిగా టాలీవుడ్ కి అరంగేట్రం చేసాడు డైరెక్టర్ బోయాపాటి శ్రీను. 2005లో మంచి అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా అప్పట్లో పెద్ద హిట్ గా నిలిచింది. ఇక ఆ తరువాత నుండి వరుసగా మంచి అవకాశాలతో దర్శకుడిగా ముందుకు దూసుకెళ్లిన బోయపాటి, మధ్యలో కొన్ని సూపర్ హిట్స్ తో పాటు ఫ్లాప్స్ ని కూడా అందుకున్నాడు.
ఇక ఇటీవల నందమూరి నటసింహం బాలయ్యతో ముచ్చటగా మూడవ సినిమా చేస్తున్న బోయపాటి, గతంలో వారిద్దరి కాంబోలో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలను మించేలా ఈ సినిమా తీస్తున్నట్లు తెలిపారు. కాగా దర్శకుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీలో తన ప్రయాణం దిగ్విజయంగా 15 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇప్పటివరకు తనతో పని చేసిన నటీనటులు,సాంకేతిక నిపుణులు, అలానే తనని ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులకు ఒక ప్రెస్ నోట్ ద్వారా బోయపాటి కృతజ్ఞతలు తెలిపారు…..!!!