ప్రముఖ నటుడు ‘శివాజీ రాజా’ కు గుండెపోటు….. !!

 203 total views,  1 views today

ప్రముఖ టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన శివాజీ రాజాకు నిన్న రాత్రి సమయంలో హఠాత్తుగా గుండెపోటు రావడంతో ఆయన్ను హైదరాబాద్ లోని స్టార్ ఆసుపత్రికి తరలించారట కుటుంబసభ్యులు. కాగా ఈ విషయాన్ని టాలీవుడ్ కు చెందిన ప్రముఖ పీఆర్వో లు ధృవీవెకరించడం జరిగింది. తెలుగు సినిమాల్లో ఎన్నో ఏళ్ల నుండి తన ఆకట్టునే నటనతో ప్రేక్షకులను మెప్పించిన శివాజీరాజా, కొన్నేళ్ల క్రితం వచ్చిన అమృతం సీరియల్ తో మరింత పాపులర్ అయ్యారు.

Sivaji Raja's panel reveals its list - Tamil News - IndiaGlitz.com

ఇక గతంలో జరిగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో గెలిచి కొన్నాళ్ళు మా అధ్యక్షుడిగా కూడా శివాజీరాజా పని చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి కొంత విషమం గానే ఉందని, మరికొంత సమయం గడిస్తేనే గాని పూర్తి వివరాలు చెప్పలేం అని డాక్టర్లు వెల్లడించినట్లు తెలుస్తోంది. కాగా ఈ విషయం తెలియగానే పలువురు సినిమా ప్రేక్షకులు, శివాజీరాజా కోలుకోవాలని, మళ్ళి మన ముందుకు ఆనందంగా రావాలని కోరుతూ పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ట్వీట్స్ చేస్తున్నారు….!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *