153 total views, 1 views today
అష్ట చమ్మా సినిమాతో టాలీవుడ్ కి హీరోగా పరిచయం అయిన నాచురల్ స్టార్ నాని, మొదటి సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడంతో పాటు తన ఆకట్టుకునే నటనతో ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు. ఇక ఆ తరువాత నుండి మెల్లగా అవకాశాలు అందుకున్న నానికి మధ్యలో మంచి హిట్స్ తో పాటు పరాజయాలు కూడా లభించాయి. అయినప్పటికీ ఏ మాత్రం కృంగిపోకుండా వరుసగా తన సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్న నాని, మధ్యలో వాల్ పోస్టర్ సినిమా అనే బ్యానర్ ని స్థాపించి ‘అ’ అనే సినిమాని తొలుత నిర్మించారు.
ఇక ప్రస్తుతం విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కుతున్న హిట్ సినిమాని తన బ్యానర్ పై నిర్మిస్తున్న నాని, ప్రస్తుతం వి సినిమాలో హీరో సుధీర్ బాబుతో కలిసి నటిస్తున్నారు. తొలిసారిగా వి సినిమా ద్వారా ఒక నెగటివ్ క్యారెక్టర్ లో నటిస్తున్న నాని, దానితో పాటు టక్ జగదీశ్ అనే సినిమా చేస్తున్నారు. శివ నిర్వాణ ఈ సినిమాకు దర్శకుడు. ఇకపోతే నేడు తన 36వ జన్మదినాన్ని జరుపుకోబోతున్న నాచురల్ స్టార్ నాని నటించబోయే 27వ సినిమా అంనౌన్సుమెంట్ నేడు రానుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్న ఈ సినిమా పూర్తి వివరాలు నేటి సాయంత్రం వెల్లడి కానున్నాయి…..!!