199 total views, 1 views today
టాలీవుడ్ నేటి సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఎందరో అభిమానులు, విపరీతమైన క్రేజ్, మార్కెట్ ఉన్న విషయం తెలిసిందే. ఇక మహేష్ కు మన తెలుగు సినిమా ఇండస్ట్రీ తో పాటు పలు ఇతర భాషల ఇండస్ట్రీల్లో కూడా కొందరు నటీనటుల్లో అభిమానులున్నారు. ఆ విధంగా తన అందం, అభినయంతో మహేష్ బాబు ప్రస్తుతం సూపర్ స్టార్ గా కొనసాగుతున్నారు. ఇకపోతే నిన్న తమ అభిమానులతో సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ ద్వారా కాసేపు ముచ్చటించిన హీరోయిన్లు రాశి ఖన్నా, పూనమ్ బజ్వా ఒకింత ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
మీరు మా మహేష్ ప్రక్కన నటిస్తే చూడాలని ఉందని ఒక అభిమాని అడుగగా, తాను కూడా ఆ అవకాశం కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నానని, అతి త్వరలో అదిజరగాలని కోరుకుంటున్నట్లు రాశి చెప్పింది. ఇక పూనమ్ బాజ్వా ని ఒక అభిమాని, మీరు మహేష్ గురించి ఒక్క మాటలో ఏమి చెప్తారు అని అడుగగా, ఆయన ఎంత ఎదిగినా కూడా ఎంతో ఒదిగి ఉండే హంబుల్ పర్సన్ అంటూ కితాబిచ్చింది పూనమ్…!!