402 total views, 1 views today
ప్రముఖ సినీ నేపధ్య గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇటీవల చెన్నై లోని ఎంజిఎం ఆసుపత్రిలో మరణించిన విషయం తెలిసిందే. అంతకముందు ఆయనకు కరోనా పాజిటివ్ రావడం, ఆ తరువాత తగ్గాడం జరిగింది. అయితే ఆ తరువాత పలు అనారోగ్య సమస్యల కారణంగా ఆయనను ఎంజిఎం ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. అనంతరం ఆయన ఆరోగ్యం మరింతగా విషమించడంతో డాక్టర్లు ఎంత ప్రయత్నించినప్పటికీ ఆయన మనకు దక్కలేదు.
అయితే ఆయన మరణానికి అసలు కారణం ఇదే అంటూ ఒక వార్త ఇటీవల ప్రచారం అవుతోంది. కొన్నాళ్ల క్రితం ఊబకాయం కారణంగా బేరియాట్రిక్ సర్జరీ చేయించుకున్న బాలసుబ్రహ్మణ్యం ఎక్కువగా మందులు తీసుకునేవారని, ఆ తరువాత నుండి మెల్లగా ఆయన శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గడంతో కరోనాని జయించినప్పటికీ కూడా పలు అనారోగ్య సమస్యలతో ఆయన మరించారని అంటున్నారు. ఆయన ప్రస్తుతం మన మధ్యన లేనప్పటికీ ఆయన పడిన సుమధుర గీతాలు ఎల్లప్పుడూ ఆయనను మనకి గుర్తు చేస్తూనే ఉంటాయి అని చెప్పాలి …!!