166 total views, 1 views today
ప్రస్తుతం దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్, దాని తరువాత హారిక హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ సంస్థలు కలిసి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న సినిమాలో హీరోగా నటించనున్న విషయం తెలిసిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించనున్న ఆ సినిమాకు “అయినను పోయిరావలె హస్తినకు” అనే టైటిల్ ని అనుకుంటున్నట్లుగా కొద్ది రోజులుగా ఒక వార్త ప్రచారం అవుతోంది.
అయితే నేడు కొన్ని ఫిలిం నగర్ వర్గాల నుండి అందుతున్న సమాచారాన్ని బట్టి ఆ సినిమాకు టైటిల్ అది కాదు అని మంచి ఫ్యామిలీ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఆ సినిమాకు దర్శకుడు త్రివిక్రమ్ వేరొక టైటిల్ అనుకుంటున్నారని సమాచారం. అయితే ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో పూర్తి నిజా నిజాలు తెలియాలంటే ఆ సినిమా యూనిట్ నుండి ఒక అధికారిక ప్రకటన వెలువడాల్సిందే…. !!