321 total views, 1 views today
అతి త్వరలో పరశురామ్ దర్శకత్వంలో తన 27వ సినిమాలో హీరోగా నటించనున్న సూపర్ స్టార్ మహేష్ బాబు, దాని తరువాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మరొక సినిమా చేయనున్నారు. కాగా వాటి రెండింటి అనంతరం ఎస్ ఎస్ రాజమౌళి తీయబోయే సినిమాలో మహేష్ నటించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికీ ఈ సినిమాకు సంబంధించి రాజమౌళి ఇటీవల అధికారికంగా ప్రకటన కూడా చేసారు.
అయితే ఈ సినిమా కథ ఇంకా సిద్ధం కానప్పటికీ, మహేష్ వంటి అందగాడి ప్రక్కన బాలీవుడ్ నటి శ్రద్ధకపూర్ అయితే సూట్ అవుతుందని, అలానే ఆ సినిమా కూడా పాన్ ఇండియా ఫీల్ తో తెరకెక్కుతుంది కాబట్టి అటు నార్త్ లో శ్రద్దకు మంచి పేరు ఉండడం కూడా తమ సినిమాకు కలిసి వస్తుందని దర్శకుడు రాజమౌళి భావిస్తున్నారని, అన్ని కుదిరితే ఆ సినిమాకు సంబంధించి పూర్తి కథ, కథనాలు సిద్ధం అయిన తరువాత ఆమెనే హీరోయిన్ గా తీసుకునే ఛాన్స్ ఉందని అంటున్నారు…..!!