163 total views, 1 views today
కోలీవుడ్ సినిమా పరిశ్రమకు ముందుగా ఎన్ వీడు ఎన్ కనవర్ సినిమాలో చిన్న పాత్రతో తమిళ సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అజిత్, ఆ తరువాత తెలుగులో ప్రేమపుస్తకం లో కూడా నటించిన అజిత్, ఆపై అమరావతి అనే సినిమా ద్వారా తమిళ్ లో హీరోగా అరంగేట్రం చేసి హిట్ అందుకున్నారు. ఇక అక్కడి హీరోగా ఒక్కొక్కటిగా అవకాశాలు అందుకుంటూ ముందుకు సాగిన అజిత్ అనతికాలంలోనే తమిళ్ లో సూపర్ స్టార్ గా తలా అనే బిరుదును సంపాదించారు.
ఇక ఇటీవల వరుసగా మంచి సక్సెస్ లు అందుకుంటూ ముందుకు సాగుతున్న అజిత్, నేడు తన 48వ పుట్టినరోజుని జరుపుకుంటున్న సందర్భంగా ఆయన అభిమానులు పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో దానిని ఒక పెద్ద ట్రెండ్ గా క్రియేట్ చేసి ఎంతో సంబరం చేసుకుంటున్నారు. కాగా ప్రస్తుతం అజిత్ హీరోగా నటిస్తున్న వాలిమై సినిమా షూటింగ్ దశలో ఉంది. హెచ్ వినోద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాని బోనీ కపూర్ నిర్మిస్తున్నారు….!!!