నా సక్సెస్ కు కారణం ఆ ముగ్గురు మహిళలు : సూపర్ స్టార్ మహేష్

 163 total views,  1 views today

టాలీవుడ్ లెజెండరీ యాక్టర్ సూపర్ స్టార్ కృష్ణ తనయుడు నేటితరం సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వరుస విజయాలతో అత్యద్భుతమైన క్రేజు, విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తో టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరిగా కొనసాగుతున్నారు.

ఇక నేడు మహిళా దినోత్సవం సందర్భంగా తన ఎదుగుదలకు కారణమైన ముగ్గురు మహిళల గురించి మహేష్ తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ఫ్యాన్స్ తో పంచుకున్నారు. తన తల్లి ఇందిరా దేవి, భార్య నమ్రత, కూతురు సితార, నా జీవితంలో ఎంతో ముఖ్యమైన ఈ ముగ్గురు మహిళలు, తమ ప్రేమను పంచుతూ నా సక్సెస్ కు కారణమయ్యారు. నేడు మహిళా దినోత్సవం సందర్భంగా ప్రపంచంలోని మహిళా మణులందరికీ హృదయపూర్వక్స్ శుభాకాంక్షలు తెలుపుతున్నాను అంటూ మహేష్ ఒక పోస్టు చేశారు……!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *