100 మిలియన్లతో సెన్సేషనల్ రికార్డు సృష్టించిన మహేష్ బాబు ‘శ్రీమంతుడు’….!!

 159 total views,  1 views today

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన శ్రీమంతుడు సినిమా ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో అందరికీ తెలిసిందే. 2015లో రిలీజ్ అయిన ఈ సినిమాలో గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేయడం అనే కొత్త కాసెప్ట్ ని కొరటాల శివ ఎంతో గొప్పగా చూపించారు. అంతేకాక ఇంతమంచి మెసేజ్ తో తెరకెక్కిన ఈ సినిమాలో పలు కమర్షియల్ హంగులు జోడించి కొరటాల తెరకెక్కించిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.

Image

మహేష్, శృతి హాసన్ ల జోడి, మది వండర్ఫుల్ ఫోటోగ్రఫి తో పాటు, రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ అద్భుతమైన మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వెరసి శ్రీమంతుడు ని సూపర్ హిట్ చేసాయి. ఇక చాలా రోజుల క్రితం యూట్యూబ్ లో ప్రేక్షకులకు అందుబాటులో ఉన్న ఈ సినిమా నేటితో ఏకంగా 100 మిలియన్ల వ్యూస్ అందుకున్న తొలి టాలీవుడ్ సినిమాగా గొప్ప సెన్సేషనల్ రికార్డు ని సొంతం చేసుకుంది. కాగా ఈ సినిమా ఇంత గొప్ప ఘనత సాధించడంతో పలువురు మహేష్ ఫ్యాన్స్, శ్రీమంతుడు యూనిట్ కు, అలానే ప్రత్యేకంగా తమ సూపర్ స్టార్ కు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా అభినందనలు తెలియచేస్తున్నారు…..!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *