523 total views, 3 views today
సూపర్ స్టార్ మహేష్ బాబు యువ దర్శకుడు పరశురామ్ పెట్ల ల క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమా సర్కారు వారి పాట. కీర్తి సురేష్ తొలిసారిగా సూపర్ స్టార్ కు జోడిగా నటిస్తున్న ఈ సినిమా కోసం ఇప్పటికే సూపర్ స్టార్ పూర్తిగా లాంగ్ హెయిర్ పెంచి ఒక డిఫరెంట్ లుక్ తో సిద్దమైన విషయం తెలిసిందే. కాగా ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక ఆర్ధిక నేరస్తుడి పాత్ర పోషించనున్నట్లు చెప్తున్నారు. ఇటీవల వరుసగా మూడు బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుని హ్యాట్రిక్ కొట్టిన సూపర్ స్టార్, పక్కాగా ఈ సర్కారు వారి పాట మూవీ తో కూడా మరొక హిట్ కొట్టి హ్యాట్రిక్ నమోదు చేయడం ఖాయం అని ఆయన ఫ్యాన్స్ అభిలషిస్తున్నారు. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే, ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ని నవంబర్ నెల మొదటి వారంలో అమెరికాలో ప్లాన్ చేసింది మూవీ యూనిట్. అందుకోసం ఇటీవల దర్శకడు పరశురామ్ సహా మరికొందరు యూనిట్ సభ్యులు అమెరికా బయలుదేరి వెళ్లి అక్కడి పలు లొకేషన్స్ వెతికే పనిలో నిమగ్నమై ఉన్నట్లు సమాచారం.
అయితే లేటెస్ట్ కొన్ని ఫిలిం నగర్ వర్గాల నుండి అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ మొదలవ్వడానికి మరొక నెలకు పైగా సమయం పడుతుందని, డిసెంబర్ మధ్యలో కానీ, లేదా జనవరి ఫస్ట్ వీక్ లో గాని మొదలవుతుందని అంటున్నారు. దానికి కారణం యూనిట్ లోని చాలా మంది సభ్యులకు వీసా రావడానికి చాలా పట్టనుండడం ఒక కారణం అయితే, హీరోయిన్ కీర్తి సురేష్ ఇప్పటికే ఒప్పుకున్న సినిమాల షూట్ పూర్తి చేయడానికి కూడా కొంత సమయం అడిగిందని అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తే కనుక నిజం అయితే మాత్రం, ఒకరకంగా ఇంకా పూర్తిగా పట్టాలెక్కకముందే సర్కారు వారి పాట మూవీ కి ఈ విధంగా ఆదిలోనే కొంత దెబ్బ పడ్డట్లే అంటున్నారు విశ్లేషకులు ….!!