సూపర్ స్టార్ ‘మైండ్ బ్లాక్’ సాంగ్ సరికొత్త రికార్డు…!!

 162 total views,  1 views today

సూపర్ స్టార్ మహేష్ నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ సరిలేరు నీకెవ్వరు మొన్న సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ కొట్టింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మహేష్ సరసన యంగ్ బ్యూటీ రష్మిక మందన్న నటించగా, దాదాపుగా కొన్నేళ్ల గ్యాప్ తరువాత లేడీ అమితాబ్ విజయశాంతి ఒక కీలక పాత్రలో నటించారు. ఇక ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ అందించిన సాంగ్స్ కూడా మంచి సక్సెస్ అయ్యాయి. ముఖ్యంగా అప్పుడెప్పుడో పోకిరి తరువాత సూపర్ స్టార్ మహేష్ ఈ సినిమాలో లుంగీ కట్టి మాస్ సాంగ్ లో నటించారు.

అదే ‘మైండ్ బ్లాక్’ అనే పల్లవితో సాగే మాస్ సాంగ్. ఆడియో రిలీజ్ టైం లోనే మంచి హిట్ కొట్టిన ఈ సాంగ్, రిలీజ్ తరువాత థియేటర్స్ ని ఊపేసింది. ఇక మూడు రోజుల క్రితం యూట్యూబ్ లో ఈ సాంగ్ వీడియో ని రిలీజ్ చేసారు. ప్రస్తుతం ఈ సాంగ్ 10 మిలియన్లకు పైగా వ్యూస్ తో పాటు 237కె లైక్స్ తో దూసుకుపోతోంది. మహేష్ అదరగొట్టేలా డ్యాన్స్ చేసిన ఈ సాంగ్ ని సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ఆడియన్స్ కూడా పదే పదే చూస్తున్నట్లు తెలుస్తోంది….!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *