174 total views, 1 views today
టాలీవుడ్ నటుడు మహేష్ బాబు, ప్రస్తుతం మన దేశం మొత్తం కూడా లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో తన ఫ్యామిలీ తో కలిసి సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక మొదటి నుండి కూడా తనకు ఏ మాత్రం తీరిక దొరికినా సరే ఫ్యామిలీతో ఎంతో ఆనందంగా గడిపే అలవాటున్న మహేష్, ఈ లాక్ డౌన్ తరువాత కుటుంబానికి మరింత దగ్గరవడం జరిగింది.
Live a little…
Love a little…
Laugh a little…
every moment, every day!! ❤️❤️❤️ #WorldLaughterDay #stayhomestaysafe pic.twitter.com/oLoquNQ6IB— Mahesh Babu (@urstrulyMahesh) May 3, 2020
ఇకపోతే నేడు నవ్వుల దినోత్సవాన్ని పురస్కరించుకుని తనయుడు గౌతమ్ కృష్ణ తో కలిసి దిగిన ఒక ఫోటోని తన సోషల్ మీడియా మాధ్యమాల్లో పోస్ట్ చేసారు మహేష్ బాబు. కొంత నవ్వు, కొంత ప్రేమ కలగలిపిన విధంగా మనం అందరం జీవితాన్ని ఆనందంగా ముందుకు తీసుకెళదాం అంటూ మహేష్ చేసిన ఆ పోస్ట్ ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది…..!!