151 total views, 1 views today
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటికే యంగ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సరిలేరు నీకెవ్వరు మూవీ సూపర్ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే దాని తరువాత 27వ సినిమాని పరశురామ్ పెట్ల దర్శకత్వంలో చేయనున్నట్టు తెలుస్తోంది. అలానే ఆ తదుపరి చేయబోయే 28వ సినిమా కూడా ఫిక్స్ అయినట్టు నిన్నటి నుండి పలు టాలీవుడ్ వర్గాలలో వార్తలు వైరల్ అవుతున్నాయి.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇటీవల మహేష్ కు ఒక అద్భుతమైన స్టోరీ లైన్ ని వినిపించారని, మంచి యాక్షన్ తో పాటు అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ మిక్స్ చేసిన ఈ కథ ఎంతో బాగా నచ్చిన మహేష్, వీలైనంత త్వరలో ఆ సినిమా ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేస్తే, వెంటనే సినిమాని మొదలెడదాం అని అన్నారట. అయితే ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందొ తెలియదుగాని, ఒకవేళ నిజం అయితే మాత్రం ఇది నిజంగా సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు మంచి పండుగ వార్తే అని చెప్పాలి…..!!