1,132 total views, 1 views today
టాలీవుడ్ నేటి తరం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ పెట్ల దర్శకత్వంలో జీఎంబి ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్, మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ల పై ఎంతో భారీ లెవెల్లో తెరకెక్కనున్న లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట. మహేష్ బాబు కెరీర్ 27వ సినిమాగా రూపొందనున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని నేడు సూపర్ స్టార్ కృష్ణ జన్మదినం సందర్భంగా సోషల్ మీడియా అకౌంట్స్ లో ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసారు సినిమా యూనిట్ వారు.
మహేష్ బాబు కొద్దిగా గడ్డం, చెవికి పోగు, మెడపై రూపాయి బిళ్ళ టాటూ తో ఎంతో డిఫరెంట్ గా కనపడుతున్న ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో దుమ్ము రేపుతోంది. కాగా లాక్ డౌన్ అనంతరం పట్టాలెక్కనున్న ఈ సినిమాకు థమన్ సంగీతాన్ని అందిస్తుండగా, పీఎస్ వినోద్ ఫోటోగ్రఫీని అందిస్తున్నారు…..!!.