సక్సెఫుల్ గా 14 ఏళ్ళు పూర్తి చేసుకున్న ఇండస్ట్రీ హిట్ ‘పోకిరి’…….!!

 154 total views,  1 views today

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వైష్ణో అకాడమీ, ఇందిరా ప్రొడక్షన్స్ బ్యానర్లు పై తెరకెక్కిన ఇండస్ట్రీ హిట్ మూవీ పోకిరి. సరిగ్గా 14 ఏళ్ళ క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ భారీ లవ్, యాక్షన్ ఎంటర్టైన్మెంట్ సినిమా కు అప్పట్లో వచ్చిన కలెక్షన్స్, రికార్డ్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పాలి. అప్పట్లో 72 ఏళ్ళ సినిమా చరిత్రలో కనీవినీ ఎరుగని అద్భుత రికార్డ్స్ ని సృష్టించిన ఈ సినిమా తాలూకు రికార్డ్స్ ఇప్పటికీ చాలాచోట్ల పదిలంగా ఉన్నాయి అంటే ఈ సినిమా పవర్ ఎటువంటిదో అర్ధం చేసుకోవచ్చు.

Image

సూపర్ స్టార్ మహేష్ పండుగా వండర్ఫుల్ పెర్ఫార్మన్స్, పలికిన డైలాగ్స్, మెలోడీ బ్రహ్మ మణిశర్మ అందించిన సూపర్బ్ సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఫైట్స్, యక్షన్ సీన్స్, కామెడీ, ఎంటర్టైన్మెంట్ తో పాటు దర్శకుడు పూరి అత్యద్భుతమైన టేకింగ్ వంటివి ఈ సినిమాని ఇంత సూపర్ డూపర్ హిట్ కొట్టేలా చేసాయి. ఇక తెరమీద మహేష్ బాబు, హీరోయిన్ ఇలియానాల జోడి ఎంతో అదరగొట్టింది. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టిన తరువాత మహేష్ బాబు ఒక్కసారిగా సూపర్ స్టార్ గా ఎంతో గొప్ప ఖ్యాతిని, క్రేజ్ ని, ఫ్యాన్ ఫాలోయింగ్ ని గడించారు. నేటితో ఈ సినిమా 14 ఏళ్ళు పూర్తి చేసుకోవడంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్, పలు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా సినిమా యూనిట్ కి అభినందనలు తెలపడంతో పాటు దీని తో సోషల్ మీడియాలో పలు ట్రెండ్స్ సృష్టించి వైరల్ గా ముందుకు తీసుకెళ్తున్నారు……!!!

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *