మహేష్ బాబు సినిమా అంతకుమించే ఉంటుందట…..!!

 122 total views,  1 views today

సూపర్ స్టార్ మహేష్ బాబు తో అతి త్వరలో తన కొత్త సినిమాని ప్రారంభించనున్నాడు యువ దర్శకుడు పరశురామ్. ఇటీవల విజయ్ దేవరకొండ, రష్మిక మందాన్నల కలయికలో వచ్చిన గీత గోవిందం సినిమాతో మంచి హిట్ కొట్టిన పరశురామ్, మహేష్ బాబు సినిమా కోసం ఒక అదిరిపోయే స్క్రిప్ట్ ని సిద్ధం చేసినట్లు చెప్పారు.

mahesh babu news

ఇప్పటివరకు తాను ఎక్కువగా మానవ సంబంధాల పైనే సినిమాలు తీసానని, అయితే ఈ సినిమా ద్వారా మహేష్ గారి ఇమేజ్ కి సరిపోయేట్లు గా కొన్ని అద్భుతమైన యాక్షన్, ఫైట్ సీన్స్ ని డిజైన్ చేసినట్లు చెప్పారు పరశురామ్. మహేష్ గారి ఫ్యాన్స్ ఈ సినిమా గురించి ఊహించుకున్న దానికి మించేలా సినిమా తీస్తారని అన్నారు. మరి తొలిసారిగా సూపర్ స్టార్ తో సినిమా తీస్తున్న పరశురామ్, ఆయనకు ఏ రేంజ్ సక్సెస్ ని అందిస్తారో చూడాలి…..!!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *