208 total views, 1 views today
ఇటీవల యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో మంచి హిట్ కొట్టి ఫుల్ జోష్ మీదున్న సూపర్ స్టార్ మహేష్, ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్ తో దేశం మొత్తం లాక్ డౌన్ అవడంతో తన ఫ్యామిలీతో కలిసి సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు. సినిమాలు లేనపుడు పిల్లలతో ఎంతో సరదాగా ఎంజాయ్ చేసే మహేష్, ఈ లాక్ డౌన్ వలన వారికి మరింతగా దగ్గరయ్యారని ఇటీవల నమ్రత చెప్పడం జరిగింది.
ఇకపోతే నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారాన్ని బట్టి అతి త్వరలో ప్రారంభం కాబోయే బిగ్ బాస్ సీజన్ 4 కు హోస్ట్ గా సూపర్ స్టార్ మహేష్ ఎంపికయినట్లు వార్తలు వస్తున్నాయి. అలానే మహేష్ బాబు పోస్టర్ ఒకటి ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో హల్ చేస్తుండడంతో అది నిజమే అని కొందరు భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం ప్రచారం అవుతోంది నిజమేనా లేకా కేవలం పుకారు మాత్రమేనా అనేది తెలియాలంటే స్టార్ మా యాజమాన్యం నుండి తదుపరి సీజన్ పై అధికారిక ప్రకటన రావలసిందే……!!