ఏపీ, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు సూపర్ స్టార్ మహేష్ భారీ విరాళం…..!!

 97 total views,  1 views today

ప్రస్తుతం భయంకర వ్యాధి కరోనా ఎఫెక్ట్ తో యావత్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలావరకు దేశాలు లాకౌట్ ప్రకటించి ప్రజలను పూర్తిగా ఇళ్లకు పరిమితం చేసిన విషయం తెలిసిందే. దీనితో పనుల్లేక చాలా మంది మధ్య, దిగువ తరగతి ప్రజలు ఆకలితో అలమటించే పరిస్థితి ఏర్పడింది. 

ఇప్పటికే కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కొంత ఆర్ధిక సాయాన్ని ప్రకటించినప్పటికీ, టాలీవుడ్ సినిమా పరిశ్రమ నుండి పలువురు ప్రముఖులు తమవంతుగా ప్రజలకు చేయూతనందించేందుకు ముందుకు వస్తున్నారు. ఆ విధంగా ముందుకు వచ్చిన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్, నేడు కాసేపటి క్రితం ఏపీ, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు తన వంతుగా రూ.1 కోటి భారీ విరాళాన్ని ప్రకటించి తన గొప్ప మనసుని చాటుకున్నారు…..!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *