139 total views, 1 views today
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల నటించిన భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు సినిమాలతో వరుసగా మూడు సూపర్ హిట్స్ సొంతం చేసుకుని వాటి ద్వారా హ్యాట్రిక్ విజయాలు అందుకున్నారు. ఇక ప్రస్తుతం తన తదుపరి సినిమాకు సంబందించిన కథా చర్చల్లో పాల్గొంటున్న సూపర్ స్టార్, నిన్న ఒక గొప్ప రికార్డు ని సొంతం చేసుకున్నారు. నిన్నటితో మహేష్ బాబు ట్విట్టర్ ఫాలోవర్ల సంఖ్య 9 మిలియన్లకు చేరుకుంది.
ఇప్పటివరకు మరే ఇతర సౌత్ ఇండియన్ హీరో కు కూడా ఈ ఘనత దక్కలేదు. 2010 ఏప్రిల్ లో ట్విట్టర్ లో జాయిన్ అయిన సూపర్ స్టార్ మొత్తంగా పదేళ్లలో ఈ అద్భుతమైన ఫీట్ ని అందుకున్నారు. ఇక ఈ సందర్భముగా కాసేపటి క్రితం తనను ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు, ముఖ్యంగా ట్విట్టర్ ఫాలోవర్లకు మహేష్ బాబు ఒక ట్వీట్ ద్వారా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఇక మహేష్ ఫ్యాన్స్ మాత్రం ఆయన తదుపరి సినిమా అనౌన్సుమెంట్ కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు…..!!