నేటితో సక్సెస్ఫుల్ గా 50 రోజులు పూర్తి చేసుకున్న సూపర్ స్టార్ ‘సరిలేరు నీకెవ్వరు’ …!!

 151 total views,  2 views today

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా యంగ్ అండ్ ఎనర్జిటిక్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ సరిలేరు నీకెవ్వరు మొన్న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ అందుకున్న విషయం తెలిసిందే. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఆ సినిమాకు రత్నవేలు ఫోటోగ్రఫిని అందించారు. సూపర్ స్టార్ మహేష్, దిల్ రాజు, అనిల్ సుంకర కలిసి తమ జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ల పై ఈ సినిమాని నిర్మించడం జరిగింది. 

మహేష్ బాబు సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో లేడీ అమితాబ్ విజయశాంతి చాలా గ్యాప్ తరువాత టాలీవుడ్ కి నటిగా రీఎంట్రీ ఇచ్చారు. ఇకపోతే నేటితో ఈ సినిమా సక్సెస్ఫుల్ గా 50 రోజులు పూర్తి చేసుకోవడంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాగా నేడు ఈ సినిమా నుండి మంచి హిట్ సాధించిన మైండ్ బ్లాక్ సాంగ్ వీడియోని యూట్యూబ్ లో రిలీజ్ చేసింది సినిమా యూనిట్….!!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *