నేటి టాలీవుడ్ డెమీ గాడ్స్ : సూపర్ స్టార్ – పవర్ స్టార్

 161 total views,  1 views today

టాలీవుడ్ సినిమా పరిశ్రమకు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా బాలనటుడిగా దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన నీడ సినిమాతో పరిచయం అయిన మహేష్ బాబు, ఆ తరువాత కొన్ని సినిమాల్లో నటించి మంచి పేరు దక్కించుకున్నారు. ఇక చివరిగా బాలనటుడిగా నటించిన బాలచంద్రుడు అనంతరం కొంత గ్యాప్ తీసుకున్న మహేష్, ఆపై 1999లో కె రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన రాజకుమారుడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి, ఫస్ట్ మూవీ తో మంచి హిట్ ని అందుకున్నారు. 

ఇక అక్కడి నుండి ఎన్నో విజయాలతో దూసుకెళ్లిన మహేష్ ప్రస్తుతం టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరిగా కొనసాగుతున్నారు. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి చిన్న తమ్ముడు పవన్ కళ్యాణ్, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతో మంచి సక్సెస్ ని అందుకున్నారు. ఇక ఆ తరువాత కూడా వరుసగా పలు సినిమాలతో విజయాలు అందుకున్న పవన్ కళ్యాణ్, ఖుషి సినిమా ఇండస్ట్రీ హిట్ తో యువతలో విపరీతమైన క్రేజ్ దక్కించుకున్నారు. ఇక ప్రస్తుతం టాలీవుడ్ లోని అగ్రనటుల్లో ఒకరిగా ముందుకు సాగుతున్నారు పవన్ ఇకపోతే టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి తరువాత నెంబర్ వన్ హీరో ఎవరు అనే విషయమై ఎప్పుడు చర్చ జరిగినా సరే, అందరికంటే ముందుగా వినిపించే పేర్లు మహేష్ బాబు, పవన్ కళ్యాణ్. 

ఇక రెండేళ్ల క్రితం సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చి రాజకీయాల్లో బిజీ అయిన పవన్, ప్రస్తుతం బాలీవుడ్ మూవీ పింక్ తెలుగు రీమేక్ లో నటిస్తున్నారు. ఇక ఇటీవల పొంగల్ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సరిలేరు నీకెవ్వరు తో సూపర్ హిట్ కొట్టిన మహేష్, అతి త్వరలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నారు. ఇక ఒకరకంగా వీరిద్దరూ కూడా నేటితరం దేమి గాడ్స్ అనడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదని, ఎందుకంటే చిరంజీవి, బాలకృష్ణ తరువాత వచ్చిన తదుపరి తరంలో వీరిద్దరే సీనియర్లు కావడం, అలానే ఇద్దరికీ కూడా కెరీర్ పరంగా మంచి సూపర్ హిట్స్ ఉండడంతో పాటు, అదే రేంజ్ లో క్రేజ్, మార్కెట్ కూడా ఉందని అంటున్నారు సినీ విశ్లేషకులు…..!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *