వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు : సూపర్ స్టార్ మహేష్….!!

 149 total views,  2 views today

ప్రస్తుతం మొత్తం యావత్ ప్రపంచం మొత్తం కూడా కరోనా వ్యాధితో వణికిపోతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఎక్కడికక్కడ ప్రజలమధ్య సామజిక దూరం మెయింటెయిన్ చేస్తేనే దీని అతి త్వరగా నిరోధించగలం అని భావించి మన దేశం సహా దాదాపుగా చాలా దేశాలు ఇప్పటికే ప్రజలను ఇళ్లకు పరిమితం చేస్తూ లాకౌట్ ప్రకటించాయి. అయితే ఈ లాకౌట్ సందర్భంగా ఎందరో పోలీసులు రేయింబవళ్లు పహారా కాస్తూ, ప్రజలకు రక్షణనందిస్తున్నారు.

 

కాగా వారిపై సర్వత్రా ప్రశంసలు కురుస్తుండగా, నేడు టాలీవుడ్ నటుడు సూపర్ స్టార్ మహేష్ బాబు, తన సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ, ఇటువంటి కష్ట సమయంలో తమ జీవితాలను కూడా పణంగా పెట్టి మన అందరి ఆరోగ్యం కోసం పోలీసులు పడుతున్న కృషి నిజంగా ఎంతో అభినందనీయం అని, ఈ సందర్భంగా ప్రజలందరి తరపున తెలంగాణ, హైదరాబాద్ పోలీసులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు సూపర్ స్టార్ మహేష్. అయితే సూపర్ స్టార్ ట్వీట్ కు కాసేపటికి స్పందించిన హైదరాబాద్ పొలిసు విభాగం వారు, థాంక్యూ మహేష్ గారు అంటూ ఆయన ట్వీట్ ని రీట్వీట్ చేయడం జరిగింది…..!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *