వారికి చేతులు జోడించి నమస్కరిస్తున్నాను : సూపర్ స్టార్ మహేష్ బాబు…..!!

 132 total views,  5 views today

ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం వలన మన దేశంతో పాటు పలు ఇతర దేశాలన్నీ కూడా ఎక్కడి ప్రజలను అక్కడే తమ ఇళ్లకు పరిమితం చేస్తూ లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా మన దేశాన్ని కూడా రాబోయే మే 3 వ తేదీ వరకు లాక్ డౌన్ చేస్తున్నట్లు ఇటీవల ప్రధాని మోడీ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సమయంలో మనకు పోలీసులు, డాక్టర్లు, శానిటరీ సిబ్బంది చేస్తున్న సేవని నిజంగా ఎప్పటికీ మరువలేమనే చెప్పాలి.

 

ప్రస్తుతం వారు తమ కుటుంబాలను సైతం ప్రక్కన పెట్టి ప్రజల రక్షణ కోసం పాటుపడుతున్నారు. కాగా ఆ విధంగా ప్రజల రక్షణ కోసం తమ ఆరోగ్యాన్ని కూడా పణంగా పెట్టి కుటుంబాలని వదిలి కష్టపడి పనిచేస్తూ మన పరిసరాలను శుభ్రం చేస్తున్న పారిశుధ్య కార్మికులకు తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రత్యేకంగా అభివందనం చేస్తూ తన ట్విట్టర్ లో ఒక పోస్ట్ చేసారు. వారి పై మన ప్రజలందరి ప్రేమ, ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని, దేవుడు వారికి మంచి జీవితాన్ని ఇవ్వాలని కోరుతూ మహేష్ పోస్ట్ చేసారు…..!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *