230 total views, 1 views today
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమా సూపర్ సక్సెస్ తో మంచి జోష్ లో ఉన్నారు. ఇక ఇటీవల మెగాస్టార్, కొరటాల మూవీలో ఒక ప్రత్యేక పాత్ర చేయడానికి మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, అలానే యువ దర్శకుడు పరశురామ్ పెట్ల దర్శకత్వంలో కూడా ఆయన ఒక సినిమా చేయనున్నారని టాలీవుడ్ వర్గాల టాక్. ఆ విషయాలు అటుంచితే, మహేష్ బాబు అతి త్వరలో తన ఫ్యామిలీ తో కలిసి హిమాలయాలకు ప్రత్యేక ట్రిప్ వేయనున్నారని అంటున్నారు.
ప్రస్తుతం శారీరకంగా బాగానే ఉన్న మహేష్, మానసికంగా కొంత ప్రశాంతత కోసం అక్కడకి వెళ్లనున్నారని, ఇప్పటికే రజినీకాంత్ వంటి వారు ఏడాదికి ఒక్కసారైనా హిమాలయాలకు వెళ్లి అక్కడి ప్రశాంత పరిస్థితుల్లో కొద్దిరోజులు గడిపి వస్తుంటారని, అందువల్లనే మహేష్ కూడా కొన్నాళ్లపాటు అక్కడ ఉండనున్నారని సమాచారం. ఇక ఈ టూర్ విషయమై అన్ని ఏర్పాట్లు సిద్ధం అయ్యాయని, అందుతున్న సమాచారం బట్టి మరొక వారం రోజుల్లో మహేష్ ఫ్యామిలీ హిమాలయాలకు పయనం అయ్యే ఛాన్స్ కనపడుతోందని అంటున్నారు….!!