ఇర్ఫాన్ ఖాన్ మరణం పై మహేష్ బాబు ఏమన్నారంటే…..??

 135 total views,  1 views today

బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ కాసేపటి క్రితం ముంబై లోని కోకిల బెన్ ధీరుభాయి అంబానీ ఆసుపత్రిలో మృతి చెందిన విషయం తెలిసిందే. తొలిసారిగా 1988లో వచ్చిన ‘సలామ్ బాంబే’ సినిమా ద్వారా ఇర్ఫాన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తొలి సినిమాతోనే నటుడిగా మంచి పేరు దక్కించుకున్న ఇర్ఫాన్, ఆ తరువాత ‘పాన్ సింగ్ తోమర్’ అనే సినిమాలో అద్భుత నటనను కనబరిచి జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నారు.

Irrfan Khan Passes Away: Mahesh Babu offers condolences; Says 'A ...

తన నటనతో ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు గెలుచుకున్న ఇర్ఫాన్ తెలుగులో మహేష్ బాబు, గుణ శేఖర్ ల కాంబోలో వచ్చిన సైనికుడు సినిమాలో విలన్ గా నటించి మంచి పేరు దక్కించుకున్నారు. కాగా నేడు ఆయన మృతి తనను ఎంతో కలిచి వేసిందని, భారతీయ సినిమా పరిశ్రమ ఒక గొప్ప నటుడిని కోల్పోయిందని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సబ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నట్లు మహేష్ బాబు కాసేపటి క్రితం ట్విట్టర్ లో ఒక పోస్ట్ చేసారు…..!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *