‘కరోనా’ మహమ్మారి పై ‘మహేష్ బాబు’ ఏమన్నారంటే…..??

 128 total views,  1 views today

ప్రస్తుతం అన్ని దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ పై సాధారణ ప్రజలతో పాటు ప్రముఖులు కూడా ఎంతో జాగ్రత్త వహిస్తున్నారు. చైనా దేశం లో మొదట వ్యాప్తి చెందిన ఈ వైరస్, ఇటీవల మన దేశంలోకి కూడా ప్రవేశించిందని, అలానే నిన్న హైదరాబాద్ లోని గాంధీ హాస్పిటల్ లో ఒక కరోనా కేసు నమోదు అయినట్లు డాక్టర్లు తెలిపారు. అతడిని అంటుకున్న దాదాపుగా 40 మందికి పైగా వ్యక్తులకు వైద్య పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. కాగా ఈ మహమ్మారి గురించి ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.

కాసేపటి క్రితం తన సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ ద్వారా ఒక ట్వీట్ చేసిన మహేష్, కరోనా సోకాకుంగా తీసుకోవలసిన జాగ్రత్తలు సంబందించిన నోట్ ను పోస్ట్ చేయడం జరిగింది. ఎప్పుడూ శుభ్రంగా ఉండడంతో పాటు ఎప్పటికప్పుడు జాగ్రత్తతో వ్యవహరించండి అంటూ మహేష్ బాబు తన పోస్ట్ ద్వారా తెలిపారు. కాగా మహేష్ చేసిన ఆ ట్వీట్ ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది….!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *