నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న ‘సూపర్ స్టార్ కృష్ణ’…..!!

 418 total views,  1 views today

టాలీవుడ్ లెజెండరీ యాక్టర్ నటశేఖర సూపర్ స్టార్ కృష్ణ నేడు తన 78వ జన్మదినాన్ని జరుపుకుంటున్న విషయం తెలిసిందే. తన కెరీర్ లో మొత్తంగా 360 సినిమాల్లో నటించిన కృష్ణ, వాటిలో 345 సినిమాల్లో హీరోగా నటిచడం జరిగింది. హీరోగా, నిర్మాతగా, దర్శకుడిగా కూడా పలు విభాగాల్లో వ్యవహరించిన కృష్ణ గురించి తెలియని తెలుగు వారుండరు. అప్పట్లో ఎన్టీఆర్,

Image

ఏఎన్నార్ తరువాత కృష్ణ తన సినిమాలతో అప్పటి యువత, మాస్ ప్రేక్షకుల్లోకి దూసుకెళ్లి ఎంతో గొప్ప విజయాలు, పేరు ప్రఖ్యాతలు స్మపాదించుకున్నారు. కాగా ప్రస్తుతం ఆయన తనయుడు మహేష్ బాబు కూడా టాలీవుడ్ లో అగ్రనటుడిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇకపోతే నేడు కృష్ణ జన్మదినం సందర్భంగా పలువురు సినిమా ప్రముఖులు ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు….!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *