‘ఎపిక్ ప్రాంక్’ తో భర్తకి షాక్ ఇచ్చిన హాట్ హీరోయిన్ ‘సన్నీ లియోన్’…..!!

 174 total views,  3 views today

శృంగార తార సన్నీ లియోన్ గురించి తెలియని వారు ఉండరు అనే చెప్పాలి. ముందుగా అక్కడక్కడా కొన్ని శృంగార ప్రాధాన్యం ఉన్న సినిమాల్లో నటించిన సన్నీ, ఆ తరువాత బాలీవుడ్ కి థ్రిల్లర్ మూవీ జిస్మ్2 ద్వారా ప్రవేశించి, అక్కడి నుండి మంచి నటిగా ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఇక మన తెలుగులో కూడా మంచు మనోజ్ హీరోగా తెరకెక్కిన కరెంట్ తీగతో పాటు ఇటీవల రాజశేఖర్ హీరోగా వచ్చినా గరుడ వేగా సినిమాలో కూడా ఆమె నటించింది.

 

ఇకపోతే ప్రస్తుతం దేశం మొత్తం కూడా లాక్ డౌన్ నడుస్తున్న నేపథ్యంలో కుటుంబంతో కలిసి హ్యాపీ గా ఇంట్లోనే గడుపుతున్న సన్నీ, నిన్న హఠాత్తుగా ఒక ఎపిక్ ప్రాంక్ చేసి తన భర్త డ్యానియల్ కు షాక్ ఇచ్చింది. తన చేతి వేలు కట్ అయినట్లుగా దులికేట్ వేలు, రక్తాన్ని చేతిపై పోసుకుని ఒక్కసారిగా ఆమె అరవడంతో వెంటనే వచ్చిన భర్త డ్యానియేల్,అక్కడే ఉన్న ఒక క్లాత్ తీసుకుని వచ్చి ఆమెకు కట్టుకడతాడు, దానితో ఒక్కసారిగా గట్టిగా అరిచినా సన్నీ, ఇదంతా ఒట్టి ప్రాంక్ మాత్రమే అని అనగానే అతడి గుండె ఝల్లుమంటుంది. కాగా ఈ వీడియో ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది….!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *